India-Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దాయాది దేశానికి చెందిన కళాకారులు, ప్రముఖులకు సంబంధించిన యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లను భారతదేశం బ్లాక్ చేస్తుంది. ఈ సందర్భంగా పాక్ నటుడు ఫవాద్ ఖాన్, గాయకుడు అతిఫ్ అస్లాంల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేయబడింది.
ఈ నెల 19 నుండి పాకిస్తాన్-దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. అనేక వివాదాలు, సన్నాహాల్లో జాప్యాల తరువాత పాకిస్తాన్ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ ఈ టోర్నమెంట్ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రసిద్ధ గాయకుడు అతిఫ్ అస్లామ్ పాడిన 'జీతో బాజీ ఖేల్ కే' తాజాగా విడుదల చేశారు.