ఒక చోట ఉండి.. మరొకరితో కాపురం చేయద్దని టీఆర్‌ఎస్ నేతలపై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది పార్టీని నాశనం చేయాలని చూశారని.. పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించారని తెలిపారు. ఒక చోట ఉండి మరొక చోట కాపురం చేయడం మంచిదికాదని ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీలోని కొంతమంది నేతలను ఉద్దేశించి అన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడబోమని… భవిష్యత్‌లో అందరూ కలిసి ప్రయాణం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…