పదవులు ఇస్తే కొందరు సంతృప్తి చెందుతారు. మరికొందరు ఆ పదవులతో కొత్త ఎత్తులు వేస్తారు. టీఆర్‌ఎస్‌లో కొందరు నాయకులు రెండో పద్ధతిని ఎంచుకున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా మారినట్టు టాక్. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని తలపట్టుకుంటున్నారట ఎమ్మెల్యేలు. తెలంగాణ ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్… వివిధ కారణాలతో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి.. ఆ తర్వాత కొత్తగా టీఆర్ఎస్‌లో చేరిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇస్తూ వస్తోంది…
పెగాసెస్ పై అసెంబ్లీ హౌస్ కమిటీ తొలి సమావేశం జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను చట్ట విరుద్ధంగా వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత మార్చిలో హౌస్ కమిటీ వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన ఇవాళ సమావేశం అయింది హౌస్ కమిటీ. రేపు హోం తదితర శాఖల అధికారులతో సమావేశం కానుంది హౌస్ కమిటీ. టీడీపీ హయాంలో పెగాసెస్ నిఘా పరికరాలను వినియోగించారన్న ఆరోపణలపై ఏర్పాటైన…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇక, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. పలు కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను తక్షణం పంజాబ్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తోంది పంజాబ్ సర్కార్.. దీనిపై పంజాబ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతం నిర్వహణలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. పంజాబ్…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వివాదం రేగుతూనే వుంది. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేయడం మంచిది కాదని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు అన్నారు. ఇక్కడే ఇల్లు కట్టాను.. అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం చెప్పలేదా..? ఎన్నికల ముందు మూడు రాజధానులని ఎందుకు అనలేదు..? అధికారం ఇచ్చారు కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తారా..? రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే… న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా..? అన్నారు గద్దె తిరుపతిరావు. జగన్ గారూ.. ప్రజల…
కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత భట్టి విక్రమార్క రేపటినుంచి మళ్లీ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా నిలిచి పోయిన పాదయాత్ర కొనసాగించనున్నారు. నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకు, అదేవిధంగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వచ్చేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మార్చ్ పేరిట గత నెల 27న ముదిగొండ మండలం యడవెల్లిలో పాదయాత్రను చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల వల్ల 102 కిలోమీటర్ల దూరం కొనసాగిన యాత్ర గంధసిరి వద్ద…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే తీవ్ర ప్రయాసల నడుమ భారత్ చేరుకున్న విద్యార్థుల ఆనందం అంతా ఇంతా కాదు. వారిలో ఏపీకి చెందిన వందల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఏపీ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి పొరుగుదేశాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులందరూ క్షేమంగా…
తెలంగాణలో యువత ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా వుంటే 80 వేల ఉద్యోగాలే భర్తీచేయడం ఏంటని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి విపక్షాలు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన రీతిలో విమర్శలు చేస్తున్నారు. 2004 – 14 వరకు ఉద్యమం లో యువత పెద్దన్న పాత్ర. 2014 – 22 వరకు ఉద్యోగాల కోసం యువత ఆశగా చూసారు. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో నిరుద్యోగులు, యువత వ్యతిరేకంగా…
ఏపీలో పెగాసస్ ప్రకంపనలు కలిగిస్తోంది. టెక్నాలజీకి ఆద్యుడిని అని చెప్పుకుంటారు చంద్రబాబు. మమతా బెనర్జీ సీనియర్ రాజకీయ నాయకురాలు. శాసనసభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని బయట పెట్టారు. చంద్రబాబు, లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మమతా బెనర్జీ పార్టీతో మాకు స్నేహపూర్వక సంబంధాలు ఏమీ లేవన్నారు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు, మమతా బెనర్జీ కలిసి పని చేసిన విషయం వాస్తవం కాదా? మమతా వ్యాఖ్యలు వాస్తవం కాకపోతే…
సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈమధ్యకాలంలో ఆయన వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకెళ్ళారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేపడుతున్నారు. ఆయన వెంట భార్య, కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్ వున్నారు. ఉదయం 11గంటల 20 నిముషాల టైంలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చారని తెలుస్తోంది. సోమాజిగూడలో వున్న సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్ళారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. ఆస్పత్రి వద్ద…