ఏపీ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిందని కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను ఖర్చు చేసి.. తర్వాత జూన్ 2020లో శాసన సభలో ప్రవేశ పెట్టారు.. ఇది రాజ్యాంగ విరుద్దం అన్నారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీన పరిచారు.…
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. సభలో జరిగని విషయాలను జరిగినట్టుగా కట్టుకథలు అల్లి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని, అసెంబ్లీలో చంద్రబాబు మైక్ కట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన వీడియోలు వైరల్ చేశారని అన్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా దూషించినట్టు వారి దగ్గర ఆధారం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణి ప్రస్తావన అసెంబ్లీలో రాలేదని, ఎవరూ అమెను పల్లెత్తు మాట…
ఈరోజు ఏపీ శాసనసభలో జరిగిన విషయమై స్పందించారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు.…
హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. తొలుత గన్‌పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్.. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్‌రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఏడుసార్లు ఈటల ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆరుసార్లు టీఆర్ఎస్, ఒకసారి బీజేపీ…
ఢిల్లీలోని అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఓ సీక్రెట్ సొరంగమార్గం ఉన్నది. ఈ సొరంగ మార్గాన్ని గురువారం రోజున మరోసారి గుర్తించారు. బ్రిటీష్ కాలంలో స్వాతంత్య్ర సమరయోధులను ఈ మార్గం ద్వారా ఎర్రకోటకు తరలించేవారని, అప్పట్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని కోర్టుగా వినియోగించేవారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ పేర్కొన్నారు. 1993 లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొదటిసారి ఈ సొరంగమార్గం గురించి విన్నానని, అయితే, దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని ఎంత…