ఏపీలో పెగాసస్ ప్రకంపనలు కలిగిస్తోంది. టెక్నాలజీకి ఆద్యుడిని అని చెప్పుకుంటారు చంద్రబాబు. మమతా బెనర్జీ సీనియర్ రాజకీయ నాయకురాలు. శాసనసభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని బయట పెట్టారు. చంద్రబాబు, లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మమతా బెనర్జీ పార్టీతో మాకు స్నేహపూర్వక సంబంధాలు ఏమీ లేవన్నారు.
మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు, మమతా బెనర్జీ కలిసి పని చేసిన విషయం వాస్తవం కాదా? మమతా వ్యాఖ్యలు వాస్తవం కాకపోతే లోకేష్ ఎందుకు పరువునష్టం కేసు వేయటం లేదు? సాక్షి పత్రిక ఒక కథనం రాసిందని పరువు నష్టం కేసు వేశారుగా. అధికారికంగా కాకుండా వ్యక్తి గతంగా కొనుగోలు చేసి ఉండొచ్చు. దీని పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోందన్నారు వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.
దీనిలో వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్ధుల పై టీడీపీ నిఘా పెట్టిందని దీనిని బట్టి అర్ధం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఎవరో సలహాలు ఇస్తే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారనటం అనైతికం. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ రావు ద్వారా మా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళారు. పార్టీ కార్యకర్తలా పని చేశారు. చంద్రబాబు మాటలు వినటం వల్లే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు శంకరగిరి మాన్యాలు పట్టుకుని వెళ్ళారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను టీడీపీ ప్రయోగించే ఉంటుంది. ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం వైసీపీకి లేదు. ప్రజాబలంతో వచ్చిన పార్టీ వైసీపీ. చంద్రబాబు మాస్ లీడర్ కాదన్నారు అంబటి రాంబాబు.