తెలంగాణలో ఒక్కసారి కూడా అసెంబ్లీని 30 రోజులు నడపక పోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నా లాంటి చిన్న సభ్యుడితో.. సీనియర్ అయిన కేసీఆర్ అనిపించుకోవడం జాలి కలుగుతుంది అని ఆయన అన్నారు. శాసన సభను నడిపించడంలో ఇబ్బంది ఏంటి అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ మీటింగ్ లో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్దం చేసుకోంటున్నాయి.
Jagga Reddy: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్ లో సీఎంని కలిశారు జగ్గారెడ్డి. సీఎంని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరడంతో, సీఎం ఛాంబర్ లోకి వెళ్లిన తరువాత జగ్గారెడ్డిని పిలిచారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులు, పథకాల కోసం సీఎంని కోరారు. సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయాలని కోరారు.
రాష్ట్రంలో శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సభాసమావేశాలు ప్రారంభం కానుండగా, బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని తెలుస్తోంది.
Payyavula Keshav: ఏపీ కేబినెట్ సమావేశంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు ప్రజల కోసం కాకుండా అయిన వారి కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు తమ మెడకు చిక్కుకోవని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన సుమారు 20 వేల మెగావాట్ల మేర హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం…
Telangana Assembly Sessions: శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశం అయ్యాయి. ఇక ఐదు రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దీంతో నేరుగా స్వల్పకాలిక చర్చ చేపడతారు. దీంతో.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చ జరగనుంది. ఇక కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు వల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉభయసభల వేదికగా…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ పెట్టినప్పటి నుంచి సినిమాను తలపించే ట్విస్టులతో రాజకీయం రసవత్తంగా సాగింది. ఓ వైపు ఉద్ధవ్ ఠాక్రే, శరత్ పవార్, మరో వైపు ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే ఇలా రెండు వర్గాల మధ్య ఎత్తులు పైఎత్తుల మధ్య అధికారం దోబూచులాడింది. చివరకు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ మద్దతుతో సీఎం పీఠాన్ని…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 7న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. 9న సాధారణ బడ్జెట్‌పై చర్చ జరిగింది. అలాగే తర్వాతి నాలుగు రోజుల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. మొత్తంగా 37 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈరోజు చివరి రోజు కాబట్టి.. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరగనుంది. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. ఎఫ్ఆర్ఎంబీ,…