ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం, వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ సమావేశాలకు ముందుగా ఏపీ కేబినెట్ భేటీ కానున్నది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. …