తెలంగాణలో ఏప్రిల్ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా ఫించన్‌లను అందజేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. వృద్ధాప్య ఫించన్‌ల మంజూరు కోసం వయో పరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిందని ఆయన గుర్తుచేశారు. కరోనా సంక్షోభం కారణంగా దీని అమలులో జాప్యం జరిగిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. 2014లో ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్య 29,21,828 మాత్రమే ఉండగా ప్రస్తుతం తెలంగాణలో లబ్ధిదారుల సంఖ్య 38.41 లక్షలకు పెరిగిందని స్పష్టం చేశారు. గత…
దేశంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారత్ బంద్ కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రభుత్వం ఈ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒకటే అని, అందుకే ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి వచ్చారు. అయితే, అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్రపు బగ్గీని అనుమతించాలని…
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం రోజున ఏపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనంతరం సీఎల్పీలోని తన పాత మిత్రులను కలిశారు. ఆ తరువాత జేసీ మీడియాతో ముచ్చటించారు. తెలంగాణను వదిలి చాలా నష్టపోయామని తెలిపారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఓడిపోతాడని తాను ముందే చెప్పానని, ఎందుకో అందరికీ తెలుసునని అన్నారు. హుజురాబాద్ గురించి తనకు తెలియదని అన్నారు. ఏపీ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయని,…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా, సభలో స్పీకర్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం సభను వాయిదా వేశారు. సభ వాయిదా వేసిన తరువాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, తప్పనిసరిగా 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే, అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ…
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం, వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ సమావేశాలకు ముందుగా ఏపీ కేబినెట్ భేటీ కానున్నది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. …