Assembly Sessions: రాష్ట్రంలో శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సభాసమావేశాలు ప్రారంభం కానుండగా, బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని తెలుస్తోంది. తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్‌కు రూపకల్పన చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ఈ మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. కాగా, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద పీట వేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.37,000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. ఆ కేటాయించిన నిధుల్లో రూ.16 వేల కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ కొలిక్కివచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా, నిధులు కేటాయించడంతోపాటు కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ తిరిగి చెల్లించేందుకు అవసరమైన నిధులనూ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
Drone Hulchul in Tirumala Live: తిరుమలలో డ్రోన్ కలకలం .. ఎన్టీవీ చేతిలో వీడియో
మరోవైపు 2022-23 ఆర్ధిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ కసరత్తను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. బడ్జెట్‌లో వివిధ పథకాలకు కేటాయింపులతో పాటు కేంద్రం నుంచి.. రాష్ట్రానికి రానున్న నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఆర్ధిక శాఖ ప్రతిపాదనలు సమర్పించింది.