"మహాభారతంలో కూడా లవ్ జిహాద్ జరిగింది" అని సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఆయన సాధారణ ప్రజలను క్షమాపణ అడగడానికి వైష్ణవ్ ప్రార్థనకు సంబంధించిన ఓ గీతాన్ని కూడా పాడాడు.