తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి.. మళ్లీ పంజా విసురుతోంది.. ఆసియా ఖండంతో పాటు యూరోప్ దేశాల్లో కరోనా విజృంభిస్తుండటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రపంచ దేశాలను మరోసారి అలెర్ట్ చేసింది. కరోనా ఇంకా చాలా దృఢంగానే ఉందని వైరస్ సులభంగానే వ్యాపిస్తోందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గుముఖం పట్టడంతో వ్యాప్తి విస్తృతమవుతున్నట్లు తెలిపింది. వైరస్ ఇంకా పూర్తిగా క్షీణించలేదని, సీజనల్ వ్యాధిలా మారలేదని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ స్పష్టం చేశారు.…
నేటి కాలంలో పెళ్ళిళ్లు కళ్లు చెదిరేలా జరుగుతున్నాయి. అయితే కరోనా పరిస్థితుల వల్ల వివాహాలు వినూత్నంగా వర్చువల్ పద్ధతిలో చేయడం చూస్తున్నాం. ఈ కోవలోకే మరో వివాహ వేడుక చేరింది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యతోనే తమిళనాడుకు చెందిన ఓ జంట వివాహం చేసుకుంది. కానీ మ్యారేజ్ రిసెప్షన్‌ని మాత్రం మెటావర్స్ టెక్నాలజీ సహాయంతో అంగరంగ వైభవంగా జరుపుకుంది. మెటావర్స్ టెక్నాలజీతో ఆసియా ఖండంలో జరిగిన తొలి వెడ్డింగ్ రిసెప్షన్ ఇదే కావడం విశేషం. శివలింగపురం…
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం హౌసింగ్ ప్రాజెక్టు హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో పూర్తయింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రూ.1,422.15 కోట్లతో ప్రభుత్వం 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. ఇందులో 115 బ్లాకులు, 234 లిఫ్టులు ఉన్నాయి. అలాగే ప్లే స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు, బస్ టెర్మినల్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంకులు, బస్తీ దవాఖానాలు, ఏటీఎంలు, బ్యాంకులు, సైక్లింగ్ ట్రాక్స్…
పూలనే… కునుకేయమంటా… తను వచ్చేనంట… తను వచ్చేనంటా… ఈ పాట గుర్తుంది కదా. ఈ సాంగ్‌ను ఎక్కడ చిత్రీకరించారో తెలుసు కదా. చైనాలో. చైనాలో వేల ఎకరాల్లో పూలను పండిస్తున్నారు. ఇప్పుడు ఈ పూల వ్యాపారం చైనాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కరోనా తరువాత ఈ పూల వ్యాపారం మరింత పెరిగింది. ఆన్ లైన్ ద్వారా పూలు, బొకేలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో వ్యాపారం మరింతగా పెరిగింది. ఆసియాలో అతిపెద్ద…
తైవాన్ పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. జియాంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక రాజ్యాధికార కాంక్ష పెరిగిపోయింది. ఆర్ధిక, సైనిక శక్తిని పెంచుకున్నది. తన దేశాన్ని విస్తరించుకోవాలని చైనా చూస్తున్నది. చుట్టుపక్కల దేశాల సరిహద్దుల్లో రోడ్డు, భవనాలు, ఇతర మౌళిక వసతుల నిర్మాణాల ఏర్పాటు పేరుతో ప్రవేశిస్తు అక్కడ బలాన్ని పెంచుకొని ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది చైనా. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో అత్యధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతూ వాటిని తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటోంది. ఇప్పుడు తన…
ప్రపంచంలో డెల్టా వేరియంట్ కొన్ని దేశాల్లో విజృంభిస్తున్నది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అమెరికాలో కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశంనుంచి వచ్చే వారిపై కొన్ని దేశాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఆసియాలోని గల్ఫ్ దేశాల్లో కరోనా కాస్త శాంతించింది. గల్ఫ్ లోని కొన్ని దేశాల్లో కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.…
ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది. అయితే, కొన్ని దేశాల్లో మాత్రం నియతృత్వ పాలన, సైనిక పాలన, ఉగ్రవాద పాలన సాగుతున్నది. అస్థిరతకు మారుపేరుగా చెప్పుకునే ఆఫ్రికాలోని అనేక దేశాల్లో స్థానిక ప్రభుత్వాలకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్రమైన పోరు జరుగుతున్నది. సహజవనరులు ఉన్నప్పటికీ వాటిపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో సామాన్యప్రజలు సమిధులౌవుతున్నారు. ఆఫ్రికాలోని బుర్కినోఫాసో, ఉగాండా, రువాండా, నైజీరియా, కాంగో, సోమాలియా తదితర దేశాల్లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఎప్పుడు ఏ…