ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది. అయితే, కొన్ని దేశాల్లో మాత్రం నియతృత్వ పాలన, సైనిక పాలన, ఉగ్రవాద పాలన సాగుతున్నది. అస్థిరతకు మారుపేరుగా చెప్పుకునే ఆఫ్రికాలోని అనేక దేశాల్లో స్థానిక ప్రభుత్వాలకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్రమైన పోరు జరుగుతున్నది. సహజవనరులు ఉన్నప్పటికీ వాటిపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో సామాన్యప్రజలు సమిధులౌవుతున్నారు. ఆఫ్రికాలోని బుర్కినోఫాసో, ఉగాండా, రువాండా, నైజీరియా, కాంగో, సోమాలియా తదితర దేశాల్లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో చెప్పలేము. రీసెంట్‌గా గినియాలో సైనిక తిరుగుబాటు జరిగింది. సైనిక తిరుగుబాటుతో గినియా ప్రభుత్వం కూలిపోయింది. సైనిక పాలన అమల్లోకి వచ్చింది. ఇటు గల్ఫ్ దేశాలైన సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నది. ఆఫ్ఘన్ నుంచి అమెరికా సేనలు తప్పుకోవడతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. 1996 నాటి అరాచక పాలన నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో, మరోసారి ఆ దేశాన్ని తాలిబన్లు కైవసం చేసుకోవడంతో మరోసారి రక్తపాతం తప్పేలా లేదు. షరియా చట్టాల పేరిత ఎలాంటి హింసలు పెడతారో అని భయపడుతున్నారు. ఇకపోతే ఆసియాలో అస్థిరతకు మారుపేరుగా ఉన్న మయమ్నార్ లోనూ అలాంటి పాలనే ఉన్నది. ప్రభుత్వాన్ని కూలదోసి ఆర్మీ పాలనను తన చేతిల్లోకి తీసుకున్నది. అప్పటి నుంచి ఆ దేశంలోని ప్రజలు దారుణమైన ఇబ్బందులు పడుతున్నారు. పాలనపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంతో సామాన్యులు నలిగిపోతున్నారు.
Read: వరదల ఎఫెక్ట్: పడవలపైనే విద్యాబోధన…