పూలనే… కునుకేయమంటా… తను వచ్చేనంట… తను వచ్చేనంటా… ఈ పాట గుర్తుంది కదా. ఈ సాంగ్‌ను ఎక్కడ చిత్రీకరించారో తెలుసు కదా. చైనాలో. చైనాలో వేల ఎకరాల్లో పూలను పండిస్తున్నారు. ఇప్పుడు ఈ పూల వ్యాపారం చైనాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కరోనా తరువాత ఈ పూల వ్యాపారం మరింత పెరిగింది. ఆన్ లైన్ ద్వారా పూలు, బొకేలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో వ్యాపారం మరింతగా పెరిగింది. ఆసియాలో అతిపెద్ద పూలమార్కెట్ కున్మింగ్‌లో ఉంది.
Read: పాములను తరిమేసేందుకు పొగ పెట్టాడు… ఇంటికి నిప్పంటుకోవడంతో…
అంతేకాదు, చైనా ఈ కామర్స్ హబ్ కావడంతో ప్రతీ వస్తువును ఆన్‌లైన్ ద్వారానే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పూల వ్యాపారం విలువ 160 బిలియన్ యునాన్లు. సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగించే పూలకు చైనా హబ్ గా మారింది. ఆన్‌లైన్ ద్వారా ఈ రకం పూలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పూల వ్యాపారం మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.