Mohsin Naqvi: బీసీసీఐకి మోసిన్ నఖ్వీ క్షమాపణలు.. కానీ మళ్లీ ఓ మెలిక పెట్టాడుగా!
- ఆసియా కప్ ముగిసి మూడు రోజులైనా తగ్గని ‘ఫైనల్’ వేడి
- బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన మోసిన్ నఖ్వీ
- ట్రోఫీ, మెడల్స్‌ను అందించేందుకు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025 ముగిసి మూడు రోజులైనా ‘ఫైనల్’ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ట్రోఫీని ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్న ఏసీసీ ఛైర్మన్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. నఖ్వీ వైఖరిపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ వెనక్కి తగ్గాడు. ఏసీసీ భేటీలో బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు.
అయితే పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ బీసీసీఐకి క్షమాపణలు చెప్పినా.. ట్రోఫీ, మెడల్స్‌ను అందించేందుకు నిరాకరించాడు. ట్రోఫీ, మెడల్స్‌ను బీసీసీఐకి ఇవ్వకూడని నఖ్వీ మొండిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌కు వచ్చి ట్రోఫీని తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆసియా కప్ ట్రోఫీ ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ నఖ్వీ నేడు యూఏఈ నుంచి లాహోర్‌కు బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని ఓ కొలిక్కి తీసుకొస్తుందో చూడాలి.
Also Read
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
Also Read: Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక.. సీఎంతో ముగిసిన పీసీసీ చీఫ్ భేటీ!
గత ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌పై భారత్ గెలిచింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ వ్యక్తుల చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోమని భారత్ ప్లేయర్స్ స్పష్టం చేశారు. దాంతో ఫైనల్ అనంతరం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాంతో ఫైనల్ వేడుక గంటకు పైగా ఆలస్యం అయింది. పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీట్రోఫీ ఇచ్చేందుకు చాలా సేపు వేదికపై నిలబడి ఉన్నాడు. వ్యక్తిగత అవార్డులు తప్ప భారత ప్లేయర్స్ ఎవరూ ట్రోఫీని తీసుకోవడానికి వేదికపైకి వెళ్లలేదు. ఆ తరువాత నఖ్వీ ట్రోఫీ, మెడల్స్‌ను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది.
తాజావార్తలు
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!