శ్రీలంకలో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ కాకుండా ఇతర దేశాల నుంచి మద్దతు ఎక్కువగా ఉన్నందున ఏసీసీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదా పూర్తిగా వైదొలగడం మినహా పాకిస్థాన్‌కు మరో ఆప్షన్ లేదు.
Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ఆసియాకప్ 2023పై భారీ ఆశులు పెట్టుకుంది. ఈ ఏడాది జరగబోతున్న ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం పీసీబీ ఉన్న పరిస్థితుల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం ఇలా పాకిస్తాన్ ను వేధిస్తున్నాయి.
పాకిస్థాన్‌కు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం సపోర్ట్ ఇవ్వడం లేదు. ఆసియా కప్ విషయంలో బంగ్లాదేశ్, శ్రీలంకల మద్దతు పాకిస్థాన్‌కు లభించడం లేదు. ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డుల మద్దతు BCCI వైపే తమ మద్దతును ప్రకటించాయి.
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ దిహాండ్రెడ్ లీగ్ లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరగా తాజాగా పనికూన ఆప్ఘానిస్తాన్ చేతుల్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఓడడం అంటే అలా ఇలా కాదు.. కనీసం పోరాటం కూడా లేకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండ్ విభాగాల్లో అట్టర్ ప్లాప్ అయింది.