సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. నామమాత్రంగా మిగిలిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. హోబర్ట్ వేదికగా జరిగిన చివరి టెస్టులో 271 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 124 పరుగులకే ఆసీస్ బౌలర్లు ఆలౌట్ చేశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది.…
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించిన ఆసీస్… రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473/9 డిక్లేర్డ్ భారీ స్కోరు చేసింది. లబుషేన్ (103), కెప్టెన్ స్మిత్ (93) రాణించారు. బెన్ స్టోక్స్ 3 వికెట్లు సాధించాడు. అయితే బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్ 236 పరుగులకే ఆలౌటైంది. రూట్ (62), మలాన్…
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఘోర పరాజయం చెందిన ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. బ్రిస్బేన్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 5 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు కోల్పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడు పెనాల్టీ పాయింట్లు కోల్పోయిన జట్టు కేవలం 9 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. అంతేకాదు.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్…
యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఉదయం సెషన్‌లో ఆస్ట్రేలియా 425 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ 152 పరుగులతో భారీ సెంచరీ సాధించాడు. ఓపెనర్ వార్నర్ 94, లబుషేన్ 74, స్టార్క్ 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్, మార్క్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. లీచ్, రూట్…
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ వారికి ప్రపంచ కప్ కంటే చాలా ముఖ్యం. ఆ రెండు జట్లు ప్రతి రెండేళ్లకోసారి ఈ సిరీస్ లో తలపడతాయి. ఈ సిరీస్ లో జట్లలోని ఆటగాళ్ల మధ్య ఓ యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఆటగాళ్లు ఈ సిరీస్ లో మతాల యుద్ధంలో కూడా తలపడతారు. అయితే నిన్న ఈ రెండు జట్ల మధ్య ఈ సిరీస్ ప్రారంభమైంది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్…
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లంటే ఎంత ఆసక్తి ఉంటుందో… ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈనెల 8 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.5:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దగ్గుతో…
ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెల 8 నుండి ఇంగ్లాండ్ జట్టుతో ఎంతో ముఖ్యమైన యాషెస్ సిరీస్ లో పాల్గొననున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కు జట్టును కూడా ప్రకటించిన తర్వాత కొన్ని ఆరోపణల కారణంగా టిమ్ పైన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దాంతో జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరు అనే దానిపైన చాలా చర్చలు జరిగాయి. మళ్ళీ స్టీవ్ స్మిత్ కే కెప్టెన్సీ భాధ్యతలు ఇస్తారు అని కూడా వార్తలు వచ్చాయి.…
టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ గా తన బాధ్యతలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల 8 నుండి ఆసీస్ జట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ సిరీస్ లో ఆసీస్ జట్టుకు కెప్టెన్ ఎవరు ఎవరు అనేది ఇంకా తేలలేదు కానీ.. ప్రస్తుతం జట్టులో ఆటగాడిగా టిమ్ పైన్ స్థానానికి ముప్పు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ఆస్ట్రేలియా చీఫ్…