ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ వారికి ప్రపంచ కప్ కంటే చాలా ముఖ్యం. ఆ రెండు జట్లు ప్రతి రెండేళ్లకోసారి ఈ సిరీస్ లో తలపడతాయి. ఈ సిరీస్ లో జట్లలోని ఆటగాళ్ల మధ్య ఓ యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఆటగాళ్లు ఈ సిరీస్ లో మతాల యుద్ధంలో కూడా తలపడతారు. అయితే నిన్న ఈ రెండు జట్ల మధ్య ఈ సిరీస్ ప్రారంభమైంది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఇక ఈరోజు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ 14 నో బాల్స్ వేశాడు. అందులో అంపైర్ రెండింటిని మాత్రమే నో బాల్స్ గా ప్రకటించాడు. దాంతో స్టోక్స్ నో బాల్స్ తో యాషెస్ వివాదం మొదలయ్యింది. ఆసీస్ మాజీ ఆటగాళ్లు అందరూ దీనిని తప్పు బడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడాలి మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుంది అనేది.