మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ సదస్సుకు ట్రంప్ రావడంతోనే మోడీ వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈజిప్టు వేదికగా జరిగిన ఈ సమావేశానికి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా మోడీ వెళ్లలేదు. తాజాగా మలేషియా వేదికగా అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశానికి కూడా ప్రధాని మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది.
Modi-Trump meet: అమెరికా, భారత్ మధ్య సుంకాల యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల చివర్లో మలేషియా కౌలాలంపూర్‌లో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలిసే అవకాశం ఉంది.
Canada–India Row: లావోస్‌లో నిర్వహించిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీనిపై భారత్ రియాక్ట్ అయింది. ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది.