Telangana Lok Sabha Result: హైదరాబాద్ లో ఎంపీ సీటు ఎంఐఎంకే సొంతం అన్నది అందరికీ తెలిసిందే. ఈ సారి బీజేపీ నుంచి మాధవీలతా కాస్త గట్టి పోటీని ఇచ్చారు. కానీ చివరకు అసదుద్దిన్ ఓవైసీ ముందంజలోకి వచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు 179553 ఓట్లు రాగా.. మాధవీలతకు 140029 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సమీర్‌కు 18888ఓట్లు వచ్చాయి. మాధవీలత అయితే గట్టిగానే పోటీ ఇచ్చిందని ఆ ఓట్లు చూస్తే అర్థమవుతుంది.
ఆదిలాబాద్ 8 వ రౌండ్ ఫలితాల్లో బిజేపీ ముందంజలో ఉంది. బీ ఆర్ ఎస్ ఆత్రం సక్కు .50859 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆత్రం సుగుణ.162563 ఓట్లు.. బిజేపీ గోడెం నగేష్.208681 ఓట్లు నమోదయ్యాయి. 8 వ రౌండ్ ముగిసే సరికి 46118 ఓట్ల మెజార్టీతో బీజేపీ లీడ్ లో ఉంది.
ఖమ్మం 17 వ రౌండ్ లో లీడ్ లో 399595 ఓట్లు మెజారిటీతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ రఘురామిరెడ్డి 376881 ఓట్ల మెజార్టీతో ముందంజలో వున్ఆనరు. బీఆర్‌ఎస్ నామ నాగేశ్వర్ రావు 163225, బీజేపీ 60153 ఓట్లు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లాలో 6వ రౌండ్ ముగిసే సరికి 55000 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కుమార్ ముందంజలో వున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ లో బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్ల లో బీజేపీ అధిక్యం కొనసాగుతుంది. జగిత్యాల, బోధన్,నిజామాబాద్ అర్బన్,లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ డిపాజిట్ గల్లంతు అయ్యే అవకాశం ఉందని టాక్.
BJP: బీజేపీని దారుణంగా దెబ్బతీసిన యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర..