Asaduddin Owaisi: 18వ లోక్‌సభకు ఇటీవల ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది. ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సభ్యులచే స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రమాణస్వీకారం లోక్‌సభలో దుమారం రేపింది. ఉర్దూలో ప్రమాణస్వీకారం చేసిన ఓవైసీ, ‘‘జై పాలస్తీనా’’ అని నినదించడం చర్చనీయాంశంగా మారింది.
అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేసే సమయంలో కొందరు అధికార పార్టీ ఎంపీలు జై శ్రీరాం, భారత్ మాతాకీ జై అంటూ నినదించారు. ఓవైసీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ‘‘జై భీమ్’’, ‘‘జై మీమ్’’, ‘‘జై పాలస్తీనా’’, జై తెలంగాణ, అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేయడంపై రచ్చ మొదలైంది. దీనిపై కొందరు పార్లమెంట్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి అసదుద్దీన్ వ్యాఖ్యల్ని తొలగిస్తామని ప్రొటెం ప్యానెల్ స్పీకర్ రాధా మోహన్ సింగ్ తెలిపారు.
గత నెలలో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి 3.38 లక్షల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీ లతపై గెలిచారు. వరసగా ఐదోసారి విజయం సాధించి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ఈసారి ఎంఐఎం తరుపున కేవలం అసద్ మాత్రమే గెలిచారు.
#WATCH | AIMIM president and MP Asaduddin Owaisi takes oath as a member of the 18th Lok Sabha; concludes his oath with the words, "Jai Bhim, Jai Meem, Jai Telangana, Jai Palestine" pic.twitter.com/ewZawXlaOB
— ANI (@ANI) June 25, 2024