ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీకి అసద్ సవాల్ చేయాల్సిన అవసం ఏముంది..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వచ్చింది రైతుల కోసం.. అసద్ కి నేను సవాల్ వేస్తున్నా.. నీ జిందగీలో ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశావా..? అని నిలదీశారు. 12 శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డ ఆయన.. తెలంగాణ ఇచ్చిన రాహుల్.. ఇక్కడ…
కాశీలోని జ్ఞాన్వాపి మసీదు వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న తాజ్ మహల్లో మూసివేసిన 22 గదులు తెరవాలంటూ కోర్టు ఆశ్రయించారు. అయితే తాజాగా జ్ఞాన్వాపి మసీదులో బయట పడ్డ శివలింగంపై దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని సంఘ్ పరివార్ యోచిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన్వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్ పరివార్ ద్వేషపూరిత…
దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ పై తాజాగా ఈ రోజు సుప్రీం కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. హైకోర్ట్ కు ఈ కేసును బదిలీ చేసింది. మరోవైపు దిశ ఎన్ కౌంటర్ పై నియమించిన సిర్పూర్కర్ కమిషన్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. దిశ ఎన్ కౌంటర్ పూర్తిగా బూటకమని.. పోలీసులు చట్టబద్ధం నడుచుకోలేదని ఆరోపించింది. ఎన్ కౌంటర్ లో పాలుపంచుకున్న 10 మంది పోలీసులపై హత్యా నేరాన్ని నమోదు చేయాలని సిఫార్సు చేసింది.…
దేశంలో ఓవైపు జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. వారణాసి కోర్ట్ తో పాటు సుప్రీం కోర్ట్ లోొ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవల వారణాసి కోర్ట్ ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇందులో భాగంగా మసీదులోని ‘వాజు ఖానా’లో బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్ట్ బయటపడిన శివలింగానికి రక్షణ ఇవ్వాలని వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు…
మదర్సాల్లో జాతీయ గీతం, జ్ఞానవాపి మసీదు సర్వే అంశాలపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యాడు. యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మసీదుల్లో జాతీయగీతం జనగణమనను తప్పనిసరి చేసింది. గురువారం నుంచే యూపీలోని అన్ని మసీదుల్లో జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుకూలంగా వారణాసి కోర్ట్ ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ నాకు దేశభక్తి సర్టిఫికేట్…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ థీమ్ ఒక్కటే.. దేశ సంపదను దోచుకోవడం అంటూ ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్లను లూటీ చేశారని, రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అంటూ మండిపడ్డారు. దేశ సంపదను దోచిన పార్టీ ఇంకా ఖతమవ్వలేదు.. ఆ పార్టీ ఇంకా కొనసాగుతోందని, రైతుల కష్టాలపై ఎలాంటి చింత…
సరూర్ నగర్లో ఇటీవల జరిగిన హత్య గురించి.. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేయడంపై ఖండిస్తున్నట్లు ఒక మీటింగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ముస్లిం అమ్మాయి.. హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి బహిష్కరిస్తే బాగుండేది.. కానీ అలా మర్డర్ చేయడం బాగోలేదని ఓవైసీ అన్నాడని, కానీ ఇదంతా షోకుటాప్ ముచ్చట్లే అంటూ మండిపడ్డారు. అసద్ మనసులో ఉంది ఒకటి… నోటి…
సరూర్ నగర్ పరువు హత్య కేసుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకుందని… అది సరైందేనని ఒవైసీ అన్నారు. సుల్తాన్ సోదరుడు ఆమె భర్తను హత్య చేయడం క్రూరమైన చర్య అని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా… ఇది నేరపూరిత చర్య అన్నారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు…
గుజరాత్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. కాంగ్రెస్ ను ఏం చేస్తారనేది జీ23 నేతలే చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్కు క్వార్టర్ పొడిగించాలని ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వెళ్లాయన్నారు. దీనిక వెనక మతలబు ఏంటని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఆజాద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినా… బీజేపీ తమకు శతృవునేనన్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లలో…