ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ శతవసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మోదీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు రాసుకొచ్చారు. తనకు చిన్నతనంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికు పక్క ఊర్లో ఓ ఫ్రెండ్ ఉండేవాడని, అయితే అతని మరణంతో ఆ ఫ్రెండ్ కుమారుడు అబ్బాస్‌ను తమ ఇంటికి తీసుకువచ్చాడని, తనతో పాటే ఉంటూ ఆ పిల్లవాడు చదువును పూర్తి చేశాడని, ఈద్ పండగ వేళ తన తల్లి ఆ అబ్బాయికి ప్రేమతో వంటలు చేసేదని మోడీ గుర్తు చేశారు.
అయితే ఆ అంశాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ప్రశ్నించారు. ఒకవేళ మీ మిత్రుడు అబ్బాస్ ఉండి ఉంటే.. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవో కావో అడిగి తెలుసుకోవాలన్నారు. మోదీ తన ఫ్రెండ్ అబ్బాస్‌ను ఎనిమిదేళ్ల తర్వాత గుర్తు చేసుకున్నాడని, అసలు మోడీకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్లు ఎవరికీ తెలియదని, ఒకవేళ అతను ఉండి ఉంటే.. ఇస్లామిక్ మతపెద్దలతో పాటు తాను కూడా మాట్లాడే ప్రసంగాలను విని వాటిపై వివరణ ఇచ్చేలా మోడీ చర్యలు తీసుకోవాలని అసద్ కోరారు. తామేమైనా అబద్దాలు చెబుతున్నామా మీ ఫ్రెండ్ అబ్బాస్ ద్వారా తెలుసుకోవాలన్నారు. అబ్బాస్ అడ్రస్ ఇస్తే తామే అతని వద్దకు వెళ్తామని అసద్ అన్నారు. ప్రవక్తపై నుపుర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమా కాదా అన్న విషయాన్ని అతన్ని అడిగి తెలుసుకుంటామన్నారు. నుపుర్ అనుచితంగా మాట్లాడినట్లు అతను అంగీకరిస్తాడని అసద్ అన్నారు.
.@narendramodi जी, अपने दोस्त अब्बास को बुलाकर उलेमा-ए-किराम की तक़रीर सुनाइये और फिर उनसे पूछिए कि जो नूपुर शर्मा ने हजरत मोहम्मद ﷺ के बारें में कहा, वो सही है या ग़लत? – Barrister @asadowaisi#prophetmuhammad ﷺpic.twitter.com/d61KAPqoDB
— Asaduddin Owaisi (@asadowaisi) June 19, 2022