దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కొత్త ఏడాది ఆరంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్ ప్రజల్లోకి దూసుకుపోతుంది. తాజాగా కమలనాథులు కూడా రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శల దాడి ఎక్కుపెట్టారు.
ఇది కూడా చదవండి: karavali Teaser: భయపెడుతున్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ టీజర్
మంగళవారం కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. ఢిల్లీ ప్రజలు ఆయా సమస్యలతో బాధపడుతుంటే.. కేజ్రీవాల్ మాత్రం బంగారు పూత పూసిన టాయిలెట్‌తో ఎంజాయ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు బంగారు పూత పూసిన టాయిలెట్‌తో నిరసన తెలిపారు. విలాసవంతమైన మరుగుదొడ్డి కోసం రూ.1.44 కోట్లు వెచ్చించారని బీజేపీ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ఢిల్లీ వాసులు.. సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. కేజ్రీవాల్ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని బీజేపీ నేత ఆర్‌పీ.సింగ్ ఆరోపించారు. రూ.1.44 కోట్లతో బంగారు పూత పూసిన టాయిలెట్‌తో కేజ్రీవాల్ ఎంజాయ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ ఇంట్లో 12 మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఢిల్లీ వాసులకు నాణ్యమైన టాయిలెట్లు, బాత్రూమ్‌లు నిర్మిస్తామని తెలిపారు.
#WATCH Delhi: BJP leader RP Singh said, "This is a gold-plated toilet. The Chief Minister had installed 12 such toilets in his house. Toilets worth Rs 1.44 crore were installed in the 'Sheeshmahal' worth Rs 56 crores. We are telling people that they take your votes by giving you… pic.twitter.com/dFBqoFlewW
— ANI (@ANI) December 31, 2024