ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ.. తొలిసారి ఎంసీడీలో పాగా వేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించేలా సీట్లు సాధించింది.. మొత్తం 250 వార్డులకు గాను మేజిక్ ఫిగర్ 126 సీట్లు ఉండగా.. అంతకంటే ఎక్కువగానే అంటే ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది.. ఇక, బీజేపీ 104 స్థానాలకు పరిమితం అయ్యింది.. ఒకప్పుడు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఘోర ఓటమి తప్పలేదు.. కేవలం 9…
Arvind Kejriwal's reaction to Delhi's victory: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గండికొట్టింది. ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 250 స్థానాల్లో ఆప్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తంగా 134 స్థానాలను, బీజేపీ 104 స్థానాలను, కాంగ్రెస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ విజయంపై ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబంరాలు చేసుకుంటున్నారు.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. డిసెంబర్ 5న సోమవారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ హేమాహేమీ నాయకులను ప్రచార బరిలోకి దింపాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పలు పార్టీలకు చెందిన నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలువురు అగ్రనేతల ప్రచారంతో గుజరాత్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కిది. నేడు ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డైమండ్ సిటీ సూరత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.