ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై తీవ్ర దాడిని ప్రారంభించారు. ప్రకటనలపై అధిక వ్యయం కారణంగా ఢిల్లీ బడ్జెట్‌కు అంతకుముందు రోజు కేంద్రం ఆమోదం ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ సమర్పణకు ఆమోదం తెలపడానికి ముందు ప్రకటనల ఖర్చుపై వివరణ ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఎక్సైజ్ పాలసీని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. పాత ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం 6 నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే పనిలో ఆప్ అధినేత కేజ్రీవాల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ నాయకులు బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రాన్ని రాక్షస రాజు హిరణ్యకశిపుడితో పోల్చారు. పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుపించారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. కొంతమంది తమను తాము హిరణ్య కశ్యపుడిలా భావించుకుంటూ తమను తాము దేవుడిలా…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. సీబీఐ అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ మంజూరు కాకముందే మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు చేరారు. ఢిల్లీ మంత్రులుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యంపాలసీలో ఎలాంటి తప్పు లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియా ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేశారని, అందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని, మంచి పని జరగాలని ప్రధాని కోరుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం చేసిన మంచి పనిని ఆపడానికే తన క్యాబినెట్ మంత్రులు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్లను కటకటాల వెనక్కి నెట్టారని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా అరెస్ట్‌పై స్పందిస్తూ 'డర్టీ పాలిటిక్స్' అని మండిపడ్డారు.