కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని.. కాలం చాలా శక్తివంతమైనదన్నారు.
కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ రానున్నారు. జనవరి 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతన్ ఖమ్మం పాల్గొననున్నారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు.
Delhi MLA's : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చర్యలకు నిరసనగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు సభకు ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం రూ. 164 కోట్ల రికవరీ నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధరలు పెరగడంతో దేశ రాజధాని నగరం పరిధిలో ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనడం ఖాయమనిపిస్తోంది.
భారత్ - చైనాల సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ నేషనల్ కౌన్సిల్ మీట్లో ఆయన మాట్లాడారు. ఓవైపు చైనా మనపై దాడికి దిగుతుంటే.. వారి ఉత్పత్తులను గణనీయంగా దిగుమతి ఎందుకు చేసుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత, చైనాతో భారత్ తన వ్యాపారాన్ని ఎందుకు ఆపడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రశ్నించారు.