Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ప్రశ్నిస్తోంది. ఈ రోజు సాయంత్రం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే 9 సార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ, వేటికి కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందని ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేజ్రీవాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఆయను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లకు సంబంధించి బలవంతపు చర్య నుండి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు నిరాకరించింది.
Delhi Excise Policy Case : మద్యం పాలసీ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా పదేపదే సమన్లు పంపడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Aravind Kejriwal : ఢిల్లీ వాటర్ బోర్డుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగా తారాస్థాయికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ఎలాంటి రాజకీయ నేపథ్యం, కుటుంబం లేకుండా ఆప్ అనే కొత్త పార్టీని జాతీయ వేదికపైకి తీసుకొచ్చారు.
Arvind Kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి చిక్కుముడి వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఈడీ ఫిర్యాదుపై ఏసీఎంఎం కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ జడ్జి రాకేష్ సయల్ నిరాకరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో శరణార్థులు చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా జైలులో ఉండాల్సి వారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును వ్యతిరేకిస్తూ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన శరణార్థుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి నిరసన సెగ తగిలింది. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూ, సిక్కు శరణార్థులు కేజ్రీవాల్ ఇంటి నివాసం వద్ద నిరసనకు దిగారు. అయితే వీరిని ‘పాకిస్తానీలు’ అని పిలిచి మరో వివాదానికి తెరలేపారు.