బుల్లి తెర యాంకర్ సుమ కొడుకు రోషన్ గురించి పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం బబుల్ గమ్ సినిమా తో తెలుగులో ఆరంగ్రేటం చేశారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానుంది.. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. గత కొన్ని రోజులుగా రోషన్ బుల్లి తెరపై పలు కార్యక్రమాల్లో పాల్గొంటు మూవీ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు.. ఇదిలా ఉండగా రోషన్ వెళ్తున్న కారును పోలీసులు అడ్డుకొని అతన్ని అరెస్ట్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియలో తెగ హల్ చల్ చేస్తుంది..
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో మద్యం, డబ్బులు భారీగా రవాణా అవుతున్నాయి. ఈ క్రమంలో కార్లు, ఇతర వాహనాలను చెక్ చేస్తున్నారు.. ఈ మేరకు రోషన్ కారును కూడా ఆపారు..అయితే రోషన్ తో పాటు అతని ఫ్రెండ్స్ తిక్క సమాధానాలు చెప్పారు. తమ ఇన్ఫ్లున్సు ఉపయోగించే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వదల్లేదు. కారు డిక్కీ ఓపెన్ చేయించారు.. అక్కడ బరువుగా ఉండే సూటుకేసులు దొరికాయి.. వాటిలో ఉన్న సరుకు చూసి పోలీసులు షాక్ అయ్యారు.
ఆ సూటుకేసుల నిండా జిలేబీలు, బబుల్ గమ్స్ ఉన్నాయి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇది నిజమైన రైడ్ కాదని. ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు కొత్త పంథాలు ఎంచుకుంటున్నారు.. గతంలో నరేష్ సినిమా ప్రమోషన్ కోసం యాంకర్ సుమను అరెస్ట్ చేశారు.. పలువురు ఆమె నిజంగానే అరెస్ట్ అయ్యారని షాక్ అయ్యారు. ఉత్తుత్తి అరెస్ట్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా సుమ కొడుకు రోషన్ బబుల్ గమ్ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా పోలీస్ రైడింగ్ లో దొరికినట్లు నమ్మించే వీడియో చేశాడు.. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రవికాంత్ పేరెపు తెరకేక్కిస్తున్నారు.. డిసెంబర్ 29 న సినిమా విడుదల కాబోతుంది..