Atrocious: ఇంత దారుణమా.. ఏడేండ్ల చిన్నారిపై అత్యాచారం చేసి గొంతుకోసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: చిన్నపిల్లపై అఘ్యాయిత్యాలు ఆగడం లేదు. చాక్లెట్లు, బిక్కట్లు, చిప్స్ అంటూ ఆశ చూపించి వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడాలేకుండా మహిళలపై క్రూరమృగాళ్లా ప్రవర్తించి కామదాహాన్ని తీర్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఇలాంటి దారుణ మైన ఘటన వెలుగు చూసింది. అభం శుభం తెలియని 7 ఏళ్ల చిన్నారిపై చిప్స్ ఆశ చూపించి అత్యాచారం చేసి దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది.
కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్క్‌మన్ గేట్ నుండి 7 ఏళ్ల బాలిక తప్పిపోయిందని ఎస్పీ సిటీ అలీగఢ్ మృగాంక్ శేఖర్ పాఠక్ తెలిపారు. అతని తల్లిదండ్రులు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వెతికారు. విచారణలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఆ చిన్నారి పొరుగున నివసించే సుయాలీన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు వెంటనే సుయాలీన్ ఇంటికి వెళ్లి సోదాలు చేయగా షాక్ కి గురయ్యారు. గోనె సంచిలో బాలిక మృతదేహం కనిపించడంతో సువాలిన్, అతని సోదరుడిని అరెస్టు చేశారు. అన్నదమ్ములిద్దరినీ విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. చిప్స్ ఇస్తానని ఆశ చూపి బాలికను ఇంట్లోకి తీసుకుని పోయామని తెలిపారు. ఆ తరువాత ఆ చిన్నారిపై అత్యాచారం చేశామని అన్నారు. అలాగే వదిలేస్తే ఆ చిన్నారి వారిద్దరిపేర్లు బయట వస్తాయని భయపడి తనని గొంతుకోసి హత్య చేశామని తెలిపారు. గోనె సంచిలో మృతదేహాన్ని వేసి ఎక్కడైన పడేసి చేతులు దులుపుకుందామని ప్లాన్ వేసారు. అయితే చిన్నారి నిందితుల ఇంట్లో వెళుతున్న వీడియో బయటకు రావడంతో అసలు భాగోతం బయటపడింది. దీంతో పోలీసులు సోదరులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Shiva Temple: దెయ్యాలు నిర్మించిన శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?
Also Read
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
తాజావార్తలు
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!