Uttar Pradesh: ఈ పోలీసులకు అవార్డ్ ఇవ్వాల్సిందేనయ్యా.. వాళ్లే బైక్ లో గన్ పెట్టి వాళ్లే అరెస్ట్ చేశారుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సినిమాల్లో ఎవరినైనా ఇరిక్కించాలి అనుకుంటే పోలీసులే వాళ్లింట్లో డ్రగ్స్, గన్స్ పెట్టి వెంటనే వచ్చి సెర్చ్ అంటూ ఇళ్లంతా వెతికేయడం తరువాత వారిని అరెస్ట్ చేయడం లాంటి సీన్లు చూస్తుంటాం. తరువాత వాళ్ల మీద కసినంతా తీర్చుకుంటారు. ఉత్తరప్రదేశ్ మీరట్ లో కూడా సేమ్ అలాంటి సీన్ ఒకటి జరిగింది. అయితే వీళ్లు డ్యూటీ కంటే సినిమాలు ఎక్కువ చూస్తారేమో..అందుకే పాపం పక్కాగా ప్లాన్ చేయలేక పట్టుబడిపోయారు. ఎలా ఇరికించాలో నేర్చుకున్నారు కానీ దాని వల్ల మేం కూడా ఇరుక్కుంటాం అని ఆలోచించలేకపోయారు. వాళ్లే కనుక డ్యూటీ కూడా సరిగ్గా చేస్తున్నట్లయితే పోలీసు బుర్రాతో కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని ఫస్టే చూసేవారు కానీ వారు అవేవి పట్టించుకోకుండా అడ్డంగా దొరికిపోయారు.
Also Read: GST: గూగుల్, ఫేస్బుక్, ఎడ్ టెక్ కంపెనీలకు కేంద్రం షాక్.. 18శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే
Also Read
- PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
- Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
- AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
- Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
అసలు విషయంలోకి వెళితే కొంతమంది పోలీసులు ఉత్తరప్రదేశ్ మీరట్ లో ఉంటున్న అజిత్ త్యాగి అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. కొంతమంది వారి ఇంట్లోకి వెళ్లగా కొంతమంది పోలీసులు అతడి బైక్ దగ్గరకు వెళ్లి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నావంటూ నానా హడావిడి చేసి ఈ నెల 26న అరెస్ట్ చేశారు. తరువాత అజిత్ కుటుంబ సభ్యులు అసలు బైక్ లోకి గన్ ఎలా వచ్చింది అని అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అక్కడ రికార్డు అయిన ఫుటేజీని చూసి వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే పోలీసులే ఇంటి డోర్ కొట్టే ముందు బైక్ లో తుపాకీ కొట్టారు. తరువాత వారిని బయటకు పిలిచి ఏదో తనిఖీ చేస్తున్నట్లు నటించి గన్ బయటకు తీసి అరెస్ట్ చేశారు.
అయితే, ఇది అన్యాయమని, తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సీసీటీవీలో రికార్డైన ఓ వీడియో ఫుటేజీని షేర్ చేశారు అశోక్ త్యాగి-రాఖి దంపతలు. తమకు కొంతమందితో భూవివాదానికి సంబంధిచి తగాదాలు ఉన్నాయని, పోలీసులు తమ ప్రత్యర్థులతో చేతులు కలిపారని వారు చెప్పుకొచ్చారు. అందుకే తమ కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజ్ ను చెరిపివేయాలని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన మీరట్ ఎస్పీ దెహాత్ కమలేశ్ బహదూర్.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దీని వెనుక ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్టు గుర్తించామని, ఎందుకు అలా చేశారో వారిని ప్రశ్నిస్తున్నామని, నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సినిమాల్లో చూశాం ఇలాంటి సీన్లు వీళ్లు మాములోల్లు కాదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
In UP’s Meerut, a family alleged two cops from the local police station planted a gun in the house and later arrested a youth Ankit Tyagi under Arms Act. The family has produced CCTV footage as evidence to corroborate their claims.
First video is of a cop allegedly planting… pic.twitter.com/UM6OzaCkPq
— Piyush Rai (@Benarasiyaa) September 27, 2023
తాజావార్తలు
-
PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
-
Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
-
AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
-
PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
ట్రెండింగ్
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!