లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీతో యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ వాగ్వాదం పెట్టుకున్నారు. రాయ్‌బరేలీ నియోజకవర్గ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆలుమగలు అన్నాక చిన్న చిన్న గొడవలు.. కోపాలు.. తాపాలు ఉండడం సహజమే. కొద్దిసేపటి తర్వాత మరిచిపోయి మళ్లీ కలిసి పోతుంటారు. ఇలా దంపతుల మధ్య జరుగుతూనే ఉంటాయి. యూపీలో ఓ జంట మాత్రం పెళ్లికి వెళ్లే విషయంలో తగాదా పడి.. ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఆయన తన భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మహ్మద్‌పూర్ గ్రామం సమీపంలో పోలీస్ స్టేషన్ జీపులో ప్రభుత్వ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు
రెస్టారెంట్‌లో కడుపారా తిని ఆస్వాదిద్దామనుకుని వెళ్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యూపీ రాజధాని లక్నోలో ఓ వ్యాపారి తన రెండో భార్యను కలిసేందేకు వచ్చి గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారవేత్త సతీష్ సోని పట్టపగలే కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓ సిగ్నల్ వద్ద గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జైపూర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్క్రీనింగ్‌పై దగ్గర జరిగిన గొడవలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను చెప్పుతో కొట్టినందుకు స్పైస్‌జెట్ ఉద్యోగిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బరేలీలోని నవాబ్‌గంజ్‌లో ఓ యువకుడి పెళ్లి విందులో చపాతీల విషయంలో ఘర్షణ తలెత్తింది. అయితే.. కొందరు యువకులు వేడి వేడి చపాతీలు తమకు అందలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. తమకు చపాతీలు ఇవ్వలేదని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలో.. యువకులకు, వరుడి కుటుంబీకుల మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ జేహెచ్‌పీజీ కళాశాలలో దారుణం జరిగింది. ప్రొఫెసర్ నీరజ్ ధాకడ్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడికి తెగబడ్డారు. క్యాంపస్ ఆవరణలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు.
టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చెన్నై భామ అయిన నివేతా పేతురాజ్ ”మెంటల్ మదిలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన ఈ భామ గత రెండేళ్లుగా ఆమె తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు.ఇదిలా ఉంటే ఈ భామకు సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ వుతుంది.కారులో ప్రయాణిస్తోన్న నివేతను ఆపిన పోలీసులు తన కారు డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా..అందుకు ఆమె నిరాకరిస్తుంది.రోడ్డు వరకే…
మహిళా ఇన్స్పెక్టర్తో ఓ బడా వ్యాపారవేత్త వాగ్వాదానికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా.. మహిళా సబ్ఇన్స్పెక్టర్, వ్యాపారవేత్త మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.