గత యేడాది ఆహాలో స్ట్రీమింగ్ అయిన జోహార్ మూవీలో శుభలేఖ సుధాకర్… సుభాష్ చంద్రబోస్ అనుయాయుడి పాత్రను పోషించి మెప్పించాడు. అనాధ బాలల కోసం అహరహం శ్రమించే పాత్ర అది. అలానే ఈ యేడాది విడుదలైన పలు చిత్రాలలోనూ సుధాకర్ నటించారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంలో సాధువుగా నటించిన సుధాకర్… ఆ తర్వాత అలీ హీరోగా నటించిన లాయర్ విశ్వనాథ్లోనూ కీలక పాత్ర పోషించారు. అలానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్లో ముగ్గురమ్మాయిలు నివాసం…
కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జంటగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నౌపాల్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన “‘ఏ కన్నులూ చూడనీ” సాంగ్ కు…