మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సివిల్ జడ్జి అభ్యర్థి అర్చన తివారీ అదృశ్యం మిస్టరీ వీడింది. ఆగస్టు 7 రైలు ప్రయాణంలో అదృశ్యమైన అర్చన తివారీ (29) ఆచూకీపై పోలీసులకు కీలక సమాచారం అందింది.
మధ్యప్రదేశ్‌లో న్యాయవాది అర్చన తివారీ (29) అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు 7 నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో మూడు పోలీస్ బృందాలు ఆమె కోసం జల్లెడ పడుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.