ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం.. పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మే 9 (శుక్రవారం) రాత్రి కూడా పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.