ఆస్కార్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లో తాజాగా వేడుక జరిగింది. ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఖతీజా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జనవరి 2న రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, ప్రపంచానికి తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో ఖతీజా పోస్ట్‌ను పంచుకున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఖతీజా, రియాస్దీన్ డిసెంబర్ 29 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.
Read Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
2020లో బురఖా ఊపిరాడకుండా వేసుకున్న కారణంగా ఖతీజా వివాదంలో చిక్కుకుంది. అయితే ఈ వివాదంపై ఖతీజా పరిణతితో స్పందించారు. తనకు నచ్చినవి వేసుకోవడం తన ఇష్టమని చెప్పింది. ఇప్పుడు ఖతీజా మళ్లీ ఎంగేజ్మెంట్ తో వార్తల్లో నిలిచింది. రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌తో తన నిశ్చితార్థాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. ఖతీజా పోస్ట్ ప్రకారం రియాస్దీన్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఆడియో ఇంజనీర్. యాదృచ్ఛికంగా ఖతీజా తన పుట్టినరోజునే రియాస్దీన్‌తో నిశ్చితార్థం చేసుకుంది.
కాబోయే భర్త ఫోటోను ఖతిజా షేర్ చేస్తూ “సర్వశక్తిమంతుడి ఆశీర్వాదంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్త, విజ్కిడ్ ఆడియో ఇంజనీర్ అయిన రియాస్దీన్ షేక్ మొహమ్మద్ తో నా నిశ్చితార్థం గురించి మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. డిసెంబర్ 29… నా పుట్టినరోజున సన్నిహిత కుటుంబ సభ్యులు, ప్రియమైనవారి సమక్షంలో నిశ్చితార్థం జరిగింది” అంటూ తెలిపారు.
రెహమాన్, ఆయన భార్య సైరా బాను ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. వాళ్ళ పేర్లు ఖతీజా, రహీమా, అమీన్. ఖతీజా తమిళ సినిమాల్లో కొన్ని పాటలు పాడారు. రజనీకాంత్ ‘ఎంథిరన్’లోని ‘పుధియ మనిధ’ పాటను ఆమె తొలిసారిగా పాడింది. ఖతీజా, రియాస్దీన్‌ల వివాహాన్ని త్వరలో ప్రకటించనున్నారు.