కోలీవుడ్ హీరో శింబు బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీ నుంచి శింబు అభిమానులకు పవర్ ఫుల్ గ్లింప్స్ తో శింబు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. శింబు (సిలంబరసన్ థెసింగు రాజేందర్) ప్రస్తుతం “పాతు తల” అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. గ్లింప్స్ చూస్తుంటే ఈ మూవీ పొలిటికల్ డ్రామా అన్పిస్తోంది. ఇందులో శింబు పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ని మరింతగా ఎలివేట్ చేసింది. విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
ఒబేలి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్‌లో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. స్టూడియో గ్రీన్ & పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో గౌతం కార్తీక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కలైయరసన్, ఇతరులుముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.