RRR Oscars: నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా.. బెట్టింగ్ రాయుళ్ల దందా షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Bettings On RRR Naatu Naatu Song Over Oscar Award: సందర్భం రావాలే గానీ.. బెట్టింగ్ వేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. క్రికెట్ దగ్గర నుంచి ఎన్నికల దాకా.. ఎవరెవరు గెలుస్తారు? అనే అంశంతో పాటు మరెన్నో విషయాలపై కోట్లలో బెట్టింగ్స్ వేస్తారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ఆస్కార్స్‌కి నామినేట్ అయిన నేపథ్యంలో.. తమ బెట్టింగ్ దందాని షురూ చేశారు. లాస్ ఏంజెల్స్‌లో మార్చి 12వ తేదీన రాత్రి గంటలకు (భారత కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 5:30 గంటలకు) ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. దీంతో.. ఏ హీరో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకుంటాడు? ఏ సినిమాకి ఆస్కార్ వస్తుంది? అనే అంశాపై జోరుగా బెట్టింగ్స్ సాగిస్తున్నారు.
Kiran Kumar Reddy: కాంగ్రెస్‌కి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. త్వరలోనే ఆ పార్టీలోకి?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
మరీ ముఖ్యంగా.. ఆర్ఆర్ఆర్ సినిమాపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్స్ జరుగుతోందని సమాచారం. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో బుకీలు తిష్టవేసి.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందా? లేదా? అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. అయితే.. ఈ బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే నడిపిస్తున్నట్టు తేలింది. 1:4 నిష్పత్తితో ఈ బెట్టింగ్ నడుస్తోందని.. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. కేవలం సామాన్యులే కాదండోయ్, పలువురు నిర్మాతలతో పాటు టెక్నీషియన్స్ కూడా ఈ బెట్టింగ్స్‌లో పాల్గొంటున్నట్టు వార్తలొస్తున్నాయి. తొలిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన నేపథ్యంలో.. గతంలో మునుపెన్నడూ లేని స్థాయిలో బెట్టింగ్స్ వ్యవహారం సాగుతోందని సమాచారం.
Pawan Kalyan: నేను మెత్తగా కన్పిస్తానేమో, కానీ మెత్తటి మనిషిని కాను.. పవన్ వార్నింగ్
ఇదిలావుండగా.. ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న ‘నాటు నాటు’ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్‌తో పాటు మరెన్నో పురస్కారాల్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్కార్స్‌కి నామినేట్ అవ్వడంతో.. ఈ పాటకి అవార్డ్ దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కూడా ఈ పాటకి అవార్డ్ దక్కాలని ట్విటర్ మాధ్యమంగా కోరాడు. ఈ పాటకి ఆస్కార్ వస్తే.. భారతదేశ ఖ్యాతి పెరుగుతుందని, మన కల్చర్ గురించి ప్రపంచానికి తెలుస్తోందని పేర్కొన్నాడు. మరి, ఆస్కార్ అవార్డ్‌ని ఈ పాట సొంతం చేసుకుంటుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు