నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్‌మెంట్ అయ్యే ఉద్యోగుల వయోపరిమితి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. అయితే, యూనిఫాం సర్వీసెస్ ర్రికూట్‌మెంట్‌లో రెండేళ్ల వయోపరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం.. అదే, నాన్ యూనిఫాం ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి ఏకంగా 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.