సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరుగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక అందించింది. ఉద్యోగులందరికీ 8వ వేతన సంఘాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పీఎం-ఆశా పథకం కోసం రూ. 35,000 కోట్లను ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రైతు సోదర సోదరీమణులకు సరసమైన ధరలకు ఎరువులు నిరంతరం సరఫరా చేసేందుకు, 2024 రబీ సీజన్‌కు పోషకాల ఆధారిత సబ్సిడీ ధరలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ కేబినెట్ పలు కార్పొరేషన్లకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా.. అసెంబ్లీలో కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పామని.. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ, మున్నూరు కాపు, పెరిక, గంగపుత్ర, పద్మశాలి కార్పొరేషన్.. ఏబీసీలకు కార్పొరేషన్ వైశ్య, రెడ్డి కార్పొరేషన్, మాల, మాదిగ కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
తాజాగా ప్రపంచకప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరోసారి వీక్షించనున్నారు. అంతేకాదు 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ పాక్ జట్టు భారత్‌కు రానుంది.
పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చించడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వడంతో.. సభ నిర్వహణ విషయంలో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.