Asaduddin Owaisi: పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చించడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వడంతో.. సభ నిర్వహణ విషయంలో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు కద.. సభను సజావుగా నడవనివ్వండని ప్రతిపక్షాలకు అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీపై అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు కాబట్టి, ఇకనైనా సభలను సజావుగా సాగనివ్వాలని విపక్షాలను అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఆందోళనల మధ్యే కీలకమైన బిల్లులు ఎటువంటి పరిశీలన లేకుండా పాసవుతున్నట్లు ఆరోపించారు. పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఆందోళనల వల్ల సభా కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. దీంతో విలువైన సభా సమయం వృధా అవుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Kadem Project: టెన్షన్ పుట్టిస్తున్న కడెం ప్రాజెక్టు గేట్లు
విపక్షాలు కోరినట్లు స్పీకర్ ఓం బిర్లా .. ప్రధానిపై అవిశ్వాస తీర్మానం చర్చకు అంగీకరించారని, ఈ నేపథ్యంలో సభ సక్రమంగా నడిచేందుకు విపక్షాలు సహకరించాలని ఓవైసీ కోరారు. న్యూఢిల్లీలో ఓ మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ చర్చకు అంగీకరించారు కాబట్టి, సభ సజావుగా సాగితే బాగుంటుందని ఓవైసీ అన్నారు. నిరసనల వల్ల విలువైన సభా సమయాన్ని కోల్పోతున్నామన్నారు. ఎన్నో రోజుల సెషన్‌ను కోల్పోయామని, ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నామని.. కానీ నిరసనల వల్ల కుదరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గందరగోళం మధ్యే కీలకమైన బిల్లులను పాస్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో కొనసాగుతున్న నిరసనల కారణంగా విలువైన పార్లమెంటరీ సమయాన్ని కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు వేయాలని, వారి వైఫల్యాలను బయటపెట్టాలని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కోల్పోవడం దురదృష్టకరమని.. వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు.
Read also: Vignesh Shivan: బేబీపై మనసు పడ్డ నయనతార భర్త.. ?
సభలో క్షుణ్ణంగా పరిశీలించకుండానే, గందరగోళం మధ్య ముఖ్యమైన బిల్లులు ఆమోదించబడుతున్న విషయాన్ని కూడా ఒవైసీ హైలైట్ చేశారు. ముఖ్యమైన బిల్లులు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం పొందుతున్నాయని.. అందువల్ల బిల్లులోని లోపాలను బయటపెట్టలేకపోతున్నామని చెప్పారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో హింసను, మణిపూర్‌లో జాతి ఘర్షణలతో పోల్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో హింసను చర్చిద్దాం అని ప్రభుత్వం చెప్పడం ద్వారా మణిపూర్‌లో హింసను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోందని.. కేంద్ర కేబినెట్ మంత్రి కుకీలపై జరిగిన హింసను ఇతర రాష్ట్రాల్లోని సంఘటనలతో పోల్చడం చాలా తప్పుని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.