ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని.. అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని స్పష్టం చేశారు.
Smart Meters: స్మార్ట్ విద్యుత్ మీటర్లుతో చాలా ఉపయోగాలు ఉన్నాయని.. అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సీ.వీ.నాగార్జున రెడ్డి.. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 18వ రాష్ట్రస్థాయి సలహా కమిటీ సమావేశం జరిగింది.. ఆ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యుత్ మీటర్లతో డబ్బులు వసూలు చేస్తామనే ప్రచారం అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు.. ఉచిత విద్యుత్ మీటర్ల విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదన్నారు..…