AP Electricity Charges: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయా? గత ఏడాది చార్జీలు పెంచకపోవడంతో.. ఈ సారి పెంచే అవకాశం ఉందా? అనే చర్చ సాగుతూ వచ్చింది.. అయితే, ఈ ఏడాది కూడా విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే న్యూస్ చెప్పింది ఏపీఈఆర్సీ.. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాదీ శుభవార్త వినిపించింది.. 2024–25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్తు భారం పడకుండా డిస్కమ్‌లు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున.. సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం పడకుండా పాత టారిఫ్‌లనే కొనసాగిస్తున్నట్లు మూడు డిస్కమ్‌లు స్పష్టం చేశాయి.. వైజాగ్‌లోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో వర్చువల్ విచారణ జరిగింది.. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు..
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
ఈ సందర్భంగా ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు.. ప్రతి డిస్కమ్‌లో వినియోగదారుల సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించినట్టు వెల్లడించారు.. ఇక, 2022–23 వినియోగదారుల సేవల్లో దేశంలోని ఏడు డిస్కమ్‌లకు ఏ గ్రేడ్ రేటింగ్ రాగా అందులో మూడు ఏపీకి చెందిన డిస్కమ్‌లే కావడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఇక, 2024–25లో ఏపీఈపీడీసీఎల్ ఆదాయ అంచనాలు చూస్తే.. ప్రస్తుత ధరల నుంచి ఆదాయం రూ.17,854.16 కోట్లు వస్తుండగా.. ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం రూ.100.44 కోట్లు.. ప్రతిపాదిత ఫుల్ కాస్ట్ రికవరీ నుంచి ఆదాయం– రూ.3207.27 కోట్లు.. మొత్తం ఆదాయం – రూ.21,161.86 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుత ధరల వద్ద లోటు సున్నాగా పేర్కొన్నారు.
Read Also: Delhi Crime: ఢిల్లీలో దారుణం.. అసహజ శృంగారానికి ఒత్తిడి చేసిన యువకుడు హత్య!
2024–25 ఏపీఎస్‌పీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనాలు చూసినట్లు అయితే.. ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.15,175.75 కోట్లు కాగా.. ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం– రూ.7521.03 కోట్లుగా ఉంది.. క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ నుంచి రాబడి – రూ.142.46 కోట్లు.. ఆర్‌ఈసీ నుంచి ఆదాయం– రూ.20 కోట్లు.. మొత్తం ఆదాయం – రూ.22,859.24 కోట్లుగా అంచనా వేశారు. ఇక, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కమ్ పరిధిలో కొత్తగా రూ.172 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 54 వరకూ నిర్మాణ పనులు చేపట్టగా 43 సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌వీడీఎస్ పథకం ద్వారా డిస్కమ్ పరిధిలోని మూడు జిల్లాల్లో రూ.1696.59 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం లేకుండా ప్రతిపాదనలు రూపొందించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు.
Read Also: TS Politics: నేడు ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం..
మొత్తంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని.. అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని స్పష్టం చేశారు. “ప్రజా విచారణలో విద్యుత్ సంస్థలు ఏపీ డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కోలు చేసిన ప్రతిపాదనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71 మంది కమిషన్‌లో నమోదు చేసుకున్నారు. మొదటి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 17 మంది లేవనెత్తిన సమస్యలపై చర్చలు జరిగాయి, మిగిలిన వ్యక్తులను తదుపరి రోజుల్లో కవర్ చేస్తారు. పబ్లిక్ హియరింగ్‌లో సమస్యను లేవనెత్తడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది మరియు విచారణలో చర్చించాల్సిన సరైన అంశాలతో రావాలని నేను వ్యక్తిగతంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. APEPDCL వెబ్‌సైట్ apeasternpower.comలో అందుబాటులో ఉన్న పబ్లిక్ హియరింగ్ లింక్ ద్వారా ప్రజలు పాల్గొనడానికి మరియు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి వారి పేర్లను వీక్షించవచ్చు మరియు నమోదు చేసుకోవచ్చు అన్నారు.