ఏపీ కాంగ్రెస్‌లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన తరుణంలో ఆ స్థానంలో వైఎస్ షర్మిలను నియమించే అవకాశాలున్నాయని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి.. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు రుద్రరాజు..
Gidugu Rudra Raju Slams AP CM YS Jagan: ఏపీలో తమకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగనే అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఏపీలో వైఎస్ జగన్, కేంద్రంలో బీజేపీతో రాజీలేని పోరాటం కాంగ్రెస్ చేస్తుందన్నారు. బీజేపీతో అంటకాగేవే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ మాయమైపోయిన పార్టీ అని, జెండాలు కనిపించినంత మాత్రాన కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ కారణం…
ప్రియాంక గాంధీ సమక్షంలో అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. ప్రియాంక గాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖును ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంగా ఎన్నికైన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.