Gidugu Rudraraju Resigns: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి.. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు రుద్రరాజు.. అయితే, రుద్రరాజు ఎందుకు రాజీనామా చేశారు? అంటే వైఎస్ షర్మిల కోసమే అని పార్టీ నేతలు చెబుతున్నమాట.. గిడుగు రుద్రరాజుతో రాజీనామా చేయించి షర్మిలకు లైన్ క్లియర్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశం ఉందంటున్నారు.. మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై వైఎస్ షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుండగా.. హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా సమాచారం.
Read Also: Jogi Ramesh: నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి నాకు పెనమలూరుతో సంబంధాలు.. జెండా ఎగరడం ఖాయం..
కాగా, ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు వైఎస్ షర్మిల.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ టచ్‌లోకి వెళ్లిన ఆమె.. తెలంగాణలో మొదట పోటీ చేస్తామని ప్రకటించినా.. ఆ తర్వాత ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. త్వరలో షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే ప్రచారం సాగుతూ వచ్చింది.. దాని అనుగుణంగానే ఆమె కాంగ్రెస్‌లో చేరడం.. తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగిపోయాయి.. ఏపీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పారనే ప్రచారం సాగింది.. ఇప్పటి వరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజు రాజీనామ చేయడంతో.. త్వరలోనే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారనే ప్రచారం సాగుతోంది. అయితే, తన కుమారుడి పెళ్లి ఏర్పాట్లలో ప్రస్తుతం బిజీగా ఉన్న షర్మిల.. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులను కలుస్తూ.. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానిస్తున్న విషయం విదితమే.