Gangadhara Nellore TDP Leader A Harikrishna Joins in YCP: చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు అమ్మగారిపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయల్దేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బస్సు యాత్రలో కుప్పం నియోజకవర్గం టీడీపీ నుంచి కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి…
Andhra Pradesh Pension News: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని భావించిన ఈసీ.. ఆంక్షలు విధించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే బదులుగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. నేడు…
Harirama Jogaiah Letter: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధినాయకులకో విజ్ఞప్తి అంటూ.. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఓ లేఖ రాశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులును బ్రిటిష్ కాలంలోనే బీసీ కులస్తులుగా పరిగణించారని పేర్కొన్నారు. ఒక్క దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా.. మిగిలిన అగ్రకులస్తులు సీఎంగా ఉన్న రోజుల్లో బీసీ జాబితా నుండి తొలగించారన్నారు. 25 శాతం జనాభా ఉన్న కాపు కులస్తులను నమ్ముకుని…
Maganti Babu Press Note: ముఖ పరిచయం, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా నిలబెడతారు? అని ఏలూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ప్రశ్నించారు. అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చారని, ఎవరైనా బీసీలు తమకు ఏలూరు పార్లమెంట్ సీట్ కావాలని అడిగారా? అని మండిపడ్డారు. 4 సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తే మిగతా బీసీ కులాలు అంగీకరిస్తారా?…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో పర్యటించారు. రోడ్డు షోలో భాగంగా కొండెవరం వద్ద ఆటోలో పవన్ రెండు కిలోమీటర్లు ప్రయాణించారు. అధ్వాన్నపు రహదారుల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించాలని జనసేనానిని డ్రైవర్లు కోరారు. Also Read: Kurnool: కర్నూలులో పోలీసుల దాష్టీకం.. కార్పొరేటర్ దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి..! ప్రతి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో పోలీసులు రెచ్చిపోయారు. ఓ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడిని చితకబాదారు. దుస్తులు విప్పి.. లాఠీలతో కొట్టి.. కాళ్ళతో తొక్కి హింసించారు. ఎన్నికల సమావేశం ఉందని పిలిపించి ఇద్దరినీ పోలీసులు చావబాదారు. ఎలాంటి కేసులు లేకున్నా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. Also Read: 2019 World Cup: 2019 ప్రపంచకప్ ఫైనల్లో తప్పిదం చేశాం.. ఇంగ్లండ్ కప్ గెలిచేదే కాదు! అంపైర్ సంచలన వ్యాఖ్యలు వివరాల ప్రకారం……
Hero Suman React on AP Politics: రాజకీయ నాయకులను అవినీతి పరుల్ని చేసింది ప్రజలే అని హీరో సుమన్ అన్నారు. అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకుని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సుమన్ సూచించారు. ఏపీ రాజకీయాలు తనకు అవసరం లేదని, అతను తెలంగాణలో ఉంటున్నాను అని సుమన్ చెప్పుకొచ్చారు. Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇలా…
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మండిపడ్డారు. గరం మసాలా లాగ చంద్రబాబు మాటలు ఉన్నాయని విమర్శించారు. బాబు సభకు 4 వేల మంది కూడా రాలేదని, తన పుట్టినరోజుకి మాత్రం 70 వేల మంది వచ్చారన్నారు. పేదవాళ్ల కాళ్లు పట్టుకోవడం తమ సాంప్రదాయం అని, పేదవారి కడుపు కొట్టడం మీ సాంప్రదాయం అని ఫైర్ అయ్యారు. తానే మళ్లీ ఎమ్మేల్యేగా గెలుస్తానని, మంత్రి పదవితో వవస్తానని మధుసూధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.…
Ex MLA Prabhakar Chowdary on Chandrababu Naidu: తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నేతృత్వంలో పని చేయాలని ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలన్నారు. కార్యకర్తలు ఓకే అంటే మాత్రం తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రభాకర్ చౌదరి చెప్పారు. దగ్గుపాటి ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. Also Read: Top Headlines…
వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో జంగా కృష్ణమూర్తి?: శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ముందు వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. పల్నాడులో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బాపట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబును జంగా కలవనున్నారట. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీలలో కార్యకర్తలతో కలిసి పల్నాడులో జరిగే బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే పల్నాడులోని టీడీపీ…