దక్షిణ భారత్కు కేంద్ర వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని గుడ్న్యూస్ చెప్పింది. వేడి గాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందవచ్చని పేర్కొంది. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత్లో భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయించిన దగ్గర నుంచి నిప్పులు చిమ్ముతున్నాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోత, చెమటలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి…
తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శనివారం మధ్యాహ్నం నుంచి వాతారణం చల్లబడింది. మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. చల్లని వాతావరణంలో భక్తులు సేదతీరారు. వరుసగా మూడో రోజు తిరుమలలో వర్షం కురిసింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ తిరుమలలో గత రెండ్రోజులుగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం సైతం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి పలు ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ కాసినప్పటికీ 12 గంటల తర్వాత…
తెలుగు రాష్ట్రాల్లో భానుడి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఎండలు మండిపోతుండటంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తప్పని సరి అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
అప్పు చేసి తీర్చనందుకు చంపేందుకు కూడా వెనకాడలేదు ఓ వ్యక్తి. ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తున్న వ్యక్తిని అప్పు తీర్చలేడన్న కోపంతో అంతమొందించేందుకు పూనుకున్నాడు. ఈ దారుణం చంద్రగిరిలో చోటుచేసుకుంది.
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని తాను కోరుకుంటున్నా అని వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీని వెన్నుపోటు పొడిచి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి టీడీపీలోకి వెళ్లారని మండిపడ్డారు. అత్యంత ధనవంతుడైన వేమిరెడ్డి నాసిరకం కాంట్రాక్టులు చేసి.. ప్రజల సొమ్మును పరోక్షంగా దోచుకున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారం చేసి మహిళలను నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ మోసం చేశారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మూలపేట ప్రాంతంలో ఈరోజు విజయసాయి రెడ్డి ఎన్నికల…
ఏపీలో ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై: ఏపీలో ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై (నామినేషన్ల పరిశీలన) జరగనుంది. ఏపీ వ్యాప్తంగా లోక్సభ సెగ్మెంట్లకు 1102, అసెంబ్లీ సెగ్మెంట్లకు 5960 మేర నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇండిపెండెంట్లు, డమ్మి అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు, మూడేసి సెట్లు దాఖలు చేశారు. వచ్చిన నామినేషన్ల సెట్లను నేడు ఎన్నికల అధికారులు పరిశీలన చేయనున్నారు. స్క్రూట్నీ తర్వాత నామినేషన్లు తగ్గనున్నాయి. స్క్రూట్నీలో ఒకే అయ్యాక డమ్మి అభ్యర్థులు నామినేషన్లను…
Scrutiny of Nomination Papers Today in AP: ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామపత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. గురువారం (ఏప్రిల్ 25) మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలు గడువు పూర్తయింది. ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై (నామినేషన్ల పరిశీలన) జరగనుంది. Also Read: YS Jagan Election Campaign: 28 నుంచి…
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మార్చి 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్.. బుధవారం (ఏప్రిల్ 24) శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188…
శంలో ఈ మధ్య రైలు ప్రమాదాలు, రైళ్లు పట్టాలు తప్పడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక కారణాలతో పాటు పలు ఇతర కారణాలతో ఈ సంఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
ఎన్నికల వేళ తరచూ వినబడే పదాల్లో డిపాజిట్ పదం ఒకటి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో డిపాజిట్ కూడా రాదని తరచూ అంటుంటారు. అసలు డిపాజిట్ అంటే..