ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు మండలంలో సోమవారం ఉదయం 10:24 గంటల సమయంలో సెకను పాటు భూమి కంపించింది. పెద్ద శబ్దంతో భూమి కంపించటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముండ్లమూరులో ఆదివారం ఉదయం, సాయంత్రం సమయాల్లో రెండుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. Also Read: Kadapa Municipal Corporation: మేయర్ పక్కనే కుర్చీ వేయాలి.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి డిమాండ్! గత…
కర్నూలులో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెబితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే అని, తాను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదలేసి వెళ్లాలని హెచ్చరించారు. వైసీపీ వారు లబ్ధి చేకూర్చే అన్నింటిని విడిచి పెట్టాలని, లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్…
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు…
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.…
వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి ఆనంద్ రాజీనామా చేశారు. ఆనంద్‌తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఆనంద్ తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆనంద్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ కార్యకలాపాలకు ఆడారి ఆనంద్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి,…
తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. తాము మరలా అధికారంలోకి వస్తాం అని, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం స్పష్టంగా చెప్తున్నా అన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ నాయకులు పెట్టిన కేసులు దువ్వాడ శ్రీనివాసను అదిరించలేవు, బెదిరించలేవని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కేసుల పేరిట వేధిస్తున్నారన్నారు. అధికారమనేది తాత్కాలికం అని, తప్పుడు కేసులు…
మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు నేడు బెయిల్‌పై విడుదలయ్యారు. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల అయ్యారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు విడుదల కాగా.. విశాఖ జైలు నుంచి రేఖమయ్య రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే.. నిందితులు తమ వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. అనంతపురం జిల్లా…
భారతదేశంలో నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)ని నిలబెడతాం అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. గ్రామాలు నుండి నగరాలకు అనుసంధానం చేసే ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతం అని పేర్కొన్నారు. కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంచి బస్‌లను సిద్దం చేశామని, కొద్ది రోజుల్లో 500 కొత్త బస్‌లను అందుబాటులోకి తీసుకువస్తాం అని మంత్రి చెప్పుకొచ్చారు. నేడు…
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు ఉండకుండా ఉండదని టీడీపీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారని, మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. పేర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదని, పేర్ని నానిని దాయాల్సిన అవసరం తమకు లేదని నారాయణరావు పేర్కొన్నారు. ‘పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు…
నగర పాలక సంస్థ, ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహించనున్న ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు) ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డా.పి.నారాయణ అన్నారు. ఈరోజు స్థానిక క్వారీ సెంటర్ రైతు బజారు ప్రక్కన కోటి 95 లక్షల 85 వేల రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు)ను మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి,…