ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చొరవను అభినందిస్తూ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ లేఖ రాశారు. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో జరిగిన ఒప్పందం, సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎంపై బిల్గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ వచ్చినందుకు సీఎం చంద్రబాబు, బృందంకు ధన్యవాదాలు చెప్పారు. మంచి వాతావరణంలో సంప్రదింపులు జరిగాయని బిల్గేట్స్ లేఖలో పేర్కొన్నారు. పేదలు-అట్టడుగువర్గాల విద్య, ఆరోగ్యంలోనూ.. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపైనా గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నాను అని బిల్గేట్స్ రాసుకొచ్చారు. Also Read:…
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం కారణంగా 2022లో నమోదైన మరణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2022 మార్చిలో అక్రమ మద్యం సేవించటంతో నమోదైన మరణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: CM Chandrababu: జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు! ఏలూరు ఎస్పీ…
మళ్లీ ఆకస్మిక తనిఖీలు తప్పవని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే నెల 12 నుంచే ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. ప్రజా సేవ పధకాల అమలు, సంక్షేమ పథకాల పూర్తిస్థాయి సంతృప్తి ఇంకా కనిపించాలన్నారు. ఆర్టీసీ సేవల్లో ఇంకా మార్పులు రావాలని, నాణ్యత పెరగాలన్నారు సీఎం చంద్రబాబు సూచించారు. దీపం పథకంలో ఇచ్చే మూడు సిలండర్ల సబ్సిడీ ఒకేసారి జమ చేస్తామన్నారు. ప్రభుత్వ సేవల్లో డేటా కీలకం అని సీఎం…
రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పింది. రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. గంటకు 40-50 కిమీ…
ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే ఏపీని అగ్ర స్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జన్యుపరంగా, వారసత్వంగా వస్తున్న వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం అని అన్నారు. వ్యాధి నిర్ణారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోందన్నారు. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ఓరియెంటేషన్ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఈరోజు విజయవాడలో మంత్రి సత్యకుమార్…
విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి పట్ల కర్కశంగా వ్యవహరించింది ఓ కూతురు. తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి హత్య చేయించందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటలో మహిళ కిడ్నాప్ అనంతరం మర్డర్ కు గురైంది. బహిర్భూమికి వెళ్లిన తల్లి కూతుర్లలో తల్లిని ఆటోలో వచ్చిన కూతురు ప్రియుడు ఎత్తుకెళ్లాడు. పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. Also Read:Top Hedlines @1PM…
రాయలసీమలో సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి తాతయ్యగుంట ‘గంగమ్మ జాతర’కు అరుదైన గౌరవం దక్కింది. పాఠ్య పుస్తకాలలో జాతరను పాఠ్యాంశంగా తమిళనాడు ప్రభుత్వం పెడుతోంది. పదో తరగతి తెలుగు రీడర్లో గంగ జాతర పాఠ్యాంశం ఉంటుంది. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన గంగ జాతరను తమిళనాడు సర్కార్ పాఠ్యాంశంగా ముద్రించింది. జానపద సాహిత్యాన్ని ఆదరించిన తమిళనాడు ప్రభుత్వానికి రచయిత పేటశ్రీ ధన్యవాదాలు తెలిపారు. Also Read: Payyavula Keshav: కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని…
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా.. జాతీయ జెండా చేత పట్టుకుని నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్.. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, పల్లె సింధూర, బండారు శ్రావణి ఇతర ప్రజా ప్రతినిధులు సహ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ,మాజీ సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నుండి…
పేకాట, ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడిన ఎంతో మంది యువకుల జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. చాలామంది పేకాట, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. మరికొందరు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పేకాట, ఆన్లైన్ బెట్టింగ్, మద్యంకు బానిసైన ఓ వ్యక్తి కార్లు రెంటుకు తీసుకొని.. యజమానులకు టోకరా వేశాడు. ఈఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడ పెనమలూరులో నివాసం ఉంటున్న కుందేటి సాయిరాం అనే వ్యక్తి పేకాట, ఆన్లైన్ బెట్టింగ్…
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ మండలంలోని జాతీయ రహదారిలో నీలం జూట్ మిల్ దగ్గర ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: IPL 2025: నేటి…