ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో స్పందన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్ స్టాప్ సొల్యూషన్ గా ఉండాలని.. 104కు ఫోన్ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్ కేటాయించాలని ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని… 104 కాల్ సెంటర్కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్…
కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ హాస్పిటల్, బెడ్స్,కోవిడ్ కేర్ సెంటర్స్, అంబులెన్స్ సర్వీస్ లు,హోమ్ ఐసోలేషన్,హోమ్ కోరoటైన్,కోవిడ్ వ్యాక్షినేషన్ సెంటర్స్ సమాచారం కొరకు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 104 కాల్ సెంటర్ పర్యవేక్షణ కొరకు స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. 10 జిల్లాలకు ఐఏఎస్ అధికారులు, 3 జిల్లాలకు జిల్లా స్థాయి అధికారులను నియమించిన ప్రభుత్వం…. జిల్లాలో 104 కాల్ సెంటర్ నిరంతరం పని చేసేలా చర్యలు…
టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి లో ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. “రాష్ట్రంలో అన్ని స్థాయిల ఎన్నికలు పూర్తయ్యాయి. కరోనా నియంత్రణ చర్యల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. ఇంక ఎవరి దృష్టి మళ్లిస్తే ఎవరికి లాభం చంద్రబాబూ? నీ బందిపోటు ముఠాలో ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే భయం పట్టుకుందా? పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. తుని నియోజకవర్గంలో తుక్కు తుక్కు అయ్యాక ఫ్రస్టేషన్ పీక్…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 37,765 సాంపిల్స్ ని పరీక్షించగా.. 5963 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అలాగే ఈ వైరస్ కారణంగా 27 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 2,569 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని.. నేటి వరకు రాష్ట్రంలో 1,57,15,757 సాం పిల్స్ ని పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 9,68,000 కు…
తిరుపతి ఉప ఎన్నిక నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఏయితే ఈ ఉప ఎన్నికలో దొంగ నోట్ల కలకలం రేపింది. దీంతో అధికార పార్టీ పై విపక్షాలు మండిపడుతున్నాయి. YCP ఓటమి భయంతోనే ఇలా చేసిందని ఫైర్ అవుతున్నాయి. అయితే తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. YCPపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో రీ-పోలింగ్ జరపాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏజెంట్లు బెదిరించారని…వలంటీర్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోజు 35 వేలకు పైగా టెస్టులు చేస్తుండగా ఆరు నుంచి ఏడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసుల శాతం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 35 వేల టెస్టులు చేస్తేనే ఏడువేలకు పైగా కేసులు వస్తే ఇక లక్ష వరకు రోజువారీ టెస్టులు నిర్వహిస్తే ఎన్ని కేసులు వస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కేసులు పెరగడంపై ప్రభుత్వం…
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా ఆరు వేలకేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ పెట్టే ఆలోచన చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే… కరోనా కేసులను అరికట్టవచ్చని…
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో ఒడిషా సహకారం కోరుతూ జగన్ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణం విషయంలో ఒడిషాతో సంప్రదింపులకు సిద్దమన్న ఏపీ సీఎం…చర్చలకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ను సమయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఒడిషా రైతులకూ లబ్ది చేకూరుతుందని లేఖలో పేర్కొన్న సీఎం జగన్… ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు, ఒడిషాలోని గజపతి…
తిరుపతి ఉపఎన్నిక ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన ఈ ఉపఎన్నికలో 25 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో యరపీ ఎన్నికల అధికారికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలకు పాల్పడేందుకు ప్రణాళికలు చేసిందని నిఘా పెంచాలని కోరారు. రిగ్గింగ్, హింస ను ప్రేరేపించేందుకు పెద్ద ఎత్తున బయట వ్యక్తులు చొరబడ్డారన్న చంద్రబాబు.. అదనపు బలగాలను దించాలని కోరారు. నకిలీ ఓట్లు పోల్ కాకుండా…