ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. రోజుకు 20 వేలకు పైగా కేసులు వస్తుండగా 100 మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వైరస్ కారణంగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి అనాధలయ్యారు. ఇక వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కడప జిల్లా వ్యాప్తంగా కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన అనాధలైన పిల్లలను గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో 142 మంది పిల్లలను గుర్తించినట్లు ICDS పిడి పద్మజ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరందరికీ 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేస్తామని వెల్లడించారు.